Vijayashanti |ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత

Vijayashanti | ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత
Vijayashanti | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చిందన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ఉద్యమకారులు ఉద్యమం చేయకపోతే ప్రత్యేక రాష్ట్రం, సీఎం, మంత్రులు ఉండేవాళ్లా..? అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
