VIDEO | సీపీకి అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు

VIDEO | సీపీకి అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
VIDEO |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వర్గం వ్యక్తులను తుపాకీతో కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోను హిమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఈ వీడియోను బీజేపీ తొలగించింది. ఈ వీడియోపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలను కాల్చుతున్నట్లుగా ఉన్న హింసాత్మక వీడియో నేపథ్యంలో హిమంతపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
దురుద్దేశపూర్వకంగా ముస్లింలను రెచ్చగొట్టేలా ఈ వీడియోను పోస్టు చేసినందుకు చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఆయన తీరు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు ఈ వీడియోను పోస్టు చేసిన హిమంత బిశ్వపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. దురదృష్టవశాత్తు, జాతి విద్వేష ప్రసంగం కొందరికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు.
