Veldanda | సర్పంచ్ ఎక్కడ..?

Veldanda | సర్పంచ్ ఎక్కడ..?

వెల్దండ, ఆంధ్రప్రభ : గతంలో గ్రామపంచాయతీలకు సర్పంచ్ లు లేకపోవడం వలన గ్రామాలలో వ్యవస్థ కుంటుపడింది. సర్పంచ్ లు వచ్చిన తరువాత కూడా ఇదే తరహాలో కొనసాగుతుందని గ్రామస్తులు అన్నారు. రాచూర్ గ్రామంలోని రెండవ వార్డులో మురుగునీరు ఏరులై పారుతుందని పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకి విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తున్నారని కాలనీవాసులు మండిపడ్డారు.

గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి కాలనీలో వ్యాపిస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని తెలిపారు. మురుగు నీరు ఇంటిలోకి ప్రవేశిస్తుండడంతో కాలనీ వాసులు మట్టితో కాలువలను ఏర్పాటు చేసుకొని నీరుని మళ్లీస్తున్నారు. ఇకనైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.

Leave a Reply