Veera Raghavaiah | పాము కాటుకు రైతు మృతి

Veera Raghavaiah | పాము కాటుకు రైతు మృతి
Veera Raghavaiah | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంక మండలం పర్ర చివర గ్రామానికి చెందిన రైతు (Farmer) ఆరేవరపు వీర రాఘవయ్య (42) బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటుండగా పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు అతన్ని నాగాయలంక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అప్పటికీ పరిస్థితి విషమం గా ఉండటం తో వైద్యుల సూచన మేరకు అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి వీర రాఘవయ్య అప్పటికే మృతి చెందిన ట్లుగా ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇరువురు ఆడపిల్లలు ఉన్నారు.
