NZB | వైభవంగా ప్రారంభమైన వీర హనుమాన్ శోభాయాత్ర

  • అంజన్న నామస్మరణతో మారుమోగుతున్న ఇందూర్
  • శోభాయాత్రను ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్..
  • బలమైన రామరాజ్య స్థాపన ఏర్పాటు కావాలి
  • ఎంపీ ధర్మపురి అరవింద్
  • పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, నుడా చైర్మన్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
  • కొనసాగుతున్న శోభాయాత్ర
  • సీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు


నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్12 (ఆంధ్రప్రభ) : అయోధ్య శ్రీరాముల వారి ఆశీస్సులతో భవిష్యత్తులో బలమైన రామరాజ్య స్థాపన ఏర్పాటు కావాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం ఉదయం వైభవంగా వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రలో హిందూ సంఘాల నాయకులు, యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంజన్న నామస్మరణతో ఇందూరు మారుమోగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్, పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం నుండి ప్రారంభ మైన వీర హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, నుడా చైర్మన్ కేశవేణు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ హాజ రయ్యారు.

ఈ సందర్భంగా శోభాయాత్రను ఎంపీ ధర్మపురి అరవింద్ శోభాయాత్ర రథానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులతో భవిష్యత్తులో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని అంజన్న స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఇందూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. మరొకసారి ఇందూరు ప్రజలకు ఎంపీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంజన్న నామస్మరణతో యువకుల నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ విగ్రహాలు…
హనుమాన్, శ్రీరాముడు, పరమశివుడు, చత్రపతి శివాజీ మహారాజ్, దత్తాత్రేయ స్వామి, భరతమాత భారీ విగ్రహాలు శోభాయాత్రలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హిందూ సంఘాలు భారీ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.

హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి..జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. శోభాయాత్రకు ప్రత్యేకంగా 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *