మణికొండ : వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారి పూజా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాలలో వారాహి హోమం (Varahi Homam) అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆషాడ శుద్ధ పాడ్యమితో మొదలుకొని శ్రీవారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను స్థానిక పంచవటి కాలనీ (Panchavati Colony)లోని రామాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా మందిరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వేదపండితులు వైభవంగా నిర్వహిస్తున్నారు.
లోకా కళ్యాణార్ధం సమస్త ప్రజల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అరవరోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వారాహి హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిర్వహిస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వేదపండితుల స్వీయ పర్యవేక్షణలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.
