Vanaparthy | పార్టీకి కంకణ బద్ధులై పనిచేసిన వారికే టికెట్లు

Vanaparthy | పార్టీకి కంకణ బద్ధులై పనిచేసిన వారికే టికెట్లు

Vanaparthy | వనపర్తి, ఆంధ్రప్రభ : పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న వారికే కౌన్సిలర్ టికెట్లు ఇవ్వడం జరిగిందని వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్త కాపు శివసేనారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రభ ప్రతినిధితో ఈ రోజు ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ టికెట్లు కేటాయింపులో ఎలాంటి అపోహలు లేవని సమన్వయంతో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్న వారికి వార్డులో గెలుపు అవకాశాలు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని సర్వే రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వార్డు టికెట్ల కేటాయింపులో ఎలాంటి పార్టీ అపోహలు లేవని అందరి సమక్షంలోనేపార్టీ బీఫాంలను కౌన్సిలర్ అభ్యర్థులకు అందజేశామన్నారు.

కొన్ని వార్డులలో ఆశ వహుల సంఖ్య అధికంగా ఉన్నందున అందరిని సమన్వయపరిచి గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లు తెలిపారు. సాధ్యమైనంతవరకు రెబల్స్ బెడద వార్డులలో లేకుండా చూసేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. నూటికి నూరుపాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిస్థాయిలో విజయం సాధించి వనపర్తి లో కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందని భీమా వ్యక్తం చేశారు. వనపర్తి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని,ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ రెబల్స్ తో తమకు విజయం దక్కుతుందని ప్రతిపక్ష పార్టీలు కలలు కంటున్నాయని అవి ఎన్నటికీ నెరవేరవన్నారు ఒకటి అర స్థానాలు మినహా ప్రతిపక్ష పార్టీలకు వార్డుల్లో గెలుపొందే అవకాశం కనుచూపుమేరలో కూడా లేదని తెలిపారు.

తాను జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పార్టీ టికెట్లు తన చేతుల మీదుగా కౌన్సిలర్ అభ్యర్థులకు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిల్లాలో మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు,ఎమ్మెల్యేల సూచనలు సలహాలతో జిల్లా పార్టీ నుంచి అభ్యర్థుల మధ్య సమన్వయాన్ని సాధించడం వల్లే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. పార్టీ నుంచి కౌన్సిలర్ టికెట్లు ఆశించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరైనా నిబంధనలు వుల్లంగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించమని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తామన్నారు. రెబల్స్గా నిలిచి గెలుపొందినప్పటికీ అలాంటివారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే పార్టీ టికెట్ను కేటాయించామని, ఒక కుటుంబంలో ఇద్దరికీ బీఫామ్ ఇచ్చారన్న అపోహలు తొలగించుకోవాలని సూచించారు. పార్టీ కోసం కట్టుబడి పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని,ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలంతా సమిష్టిగా టికెట్లు కేటాయించిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Leave a Reply