చిత్తూరు పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జ‌యంతి

చిత్తూరు పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జ‌యంతి

చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌భ : మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “మహర్షి వాల్మీకి మన సమాజానికి నీతి, ధర్మం, సత్యం అనే విలువలను బోధించిన మహానుభావుడు. ఆయన రచించిన రామాయణం కేవలం ఒక ఇతిహాస గ్రంథం కాదు, అది మనిషి జీవన విధానానికి మార్గదర్శక గ్రంథం. ప్రతి మనిషిలో ఉన్న చెడును తొలగించి మంచి దారిలో నడిపించే శక్తి వాల్మీకి రచనలో ఉంది” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ ఎస్. ఆర్.రాజశేఖర రాజు, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ శివానంద కిషోర్, చిత్తూరు సబ్ – డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్, ఏ.ఆర్ డి.ఎస్పీ శ్రీ మహబూబ్ భాష, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర్, మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస రావు, ఆర్.ఐ అడ్మిన్ శ్రీ సుధాకర్ మరియు సిబ్బంది పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply