Vaishnav tej | అసలు ప్లాన్ ఏంటి..?

Vaishnav tej | అసలు ప్లాన్ ఏంటి..?

Vaishnav tej | మూడేళ్లలో ఏ కథా నచ్చలేదా..?
వరుస ప్లాపులతో వెనుకబడిన వైష్ణవ్ తేజ్
మారుతి కథకు ఓకే చెప్పాడా..?
సంక్రాంతి టార్గెట్‌గా కొత్త సినిమా
త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం

Vaishnav tej | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ (Megastar) మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడుగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా చేయడంతో.. మరింత దూకుడు చూపిస్తాడు.. అనుకుంటే.. మూడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కొత్త సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఇప్పుడు ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత చేసే సినిమాని ప్లాప్ డైరెక్టర్ తో చేయనున్నాడా…?

Vaishnav tej | మూడేళ్లలో.. ఏ కథా నచ్చలేదా..

ఉప్పెన సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ కథలో కొత్తదనం ఉండడం.. అలాగే ఎమోషన్ ని బాగా డీల్ చేయడం తదితర కారణాల వలన ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. అయితే.. ఆతర్వాత సరైన కథలు ఎంచుకోవడంలో తడబడ్డాడు వైష్ణవ్ తేజ్. కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలతో వరుసగా ప్లాపులు చూసాడు. దీంతో ఏ సినిమా (Movie) చేయాలి..? ఎలాంటి సినిమా చేయాలి అనేది తేల్చుకోలేకపోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ మూడేళ్లలో చాలా మంది దర్శకులు, రచయితలు కథలు చెప్పారట కానీ.. ఏ కథకు ఓకే చెప్పలేదట.

Vaishnav tej

Vaishnav tej | టార్గెట్ సంక్రాంతి..

అయితే.. ఇప్పుడు డైరెక్టర్ మారుతి చెప్పిన కథకు వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ అనే ప్లాప్ మూవీ చేశాడు. దీని పై చాలా విమర్శలు రావడం తెలిసిందే. ఈ సినిమా తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ.. రాజాసాబ్ (Raja saab) ప్లాప్ అనే ముద్ర మాత్రం మారుతి పై పడింది. ఇప్పుడు మారుతి మళ్లీ తనని తాను నిరూపించుకోవాలి. ఈసారి కథ పై బాగా వర్క్ చేసి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట. వరుణ్‌ తేజ్ తో మారుతి సినిమా అంటూ ప్రచారం జరిగింది. అయితే.. వరుణ్‌ తో సెట్ కాలేదు.. వైష్ణవ్ తేజ్ తో సెట్ అయ్యిందని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఇది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Vaishnav tej

Leave a Reply