Utnoor | ఘనంగా వాజ్ పేయి జయంతి

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి 101 జయంతి వేడుకలను ఇవాళ‌ అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని కీర్తిశేషులు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శృతి వనం ఎక్స్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పోల్సాని మురళీధర్ రావు, రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితిష్ రాథోడ్ బీజేపీ నాయకులు పాల్గొని అటల్ బీహార్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈసందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ మురళీధర్ రావు మాట్లాడుతూ… మాజీ ప్రధాని వాజ్ పేయి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం స్వర్గీయ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ పార్టీ ఉట్నూరు మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మాజీ జెడ్పిసి సాడిగే గంగన్న, ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ దవులే బాలాజీ, మాజీ ఎంపీటీసీ కందుకూరు రమేష్, సాల్గర్ రవీందర్, బీజేపీ నాయకులు సాడిగే రాజేశ్వర్, కొమ్ము రామచందర్, ఉస్కేముల దేవిదాస్, తోట సత్తన్న, టేకం హరిప్రసాద్, బొడ్డు కిరణ్, జగన్ పటేల్, ముత్యాల సంజీవరెడ్డి, సొంటకే శ్రీకాంత్, రాథోడ్ శేషారావు, ముఖాజీ, ఉమ్రి ఉపసర్పంచ్ తిత్రే.కిషన్, అర్జున్ సింగ్, అరవింద్, చింతలరమణ,. రామగిరి వేణు, కందుకూరి విజయ్ బాబు, రాజేందర్ బాబు పటేల్, కనక విజయ్, గుమ్ముల శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply