కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఉట్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా 16 మందికి మంజూరైన చెక్కులను శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా నిరుపేద ఆడపడుచుల పిల్లలకు వివాహ లకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ పథకాలు నిరుపేదలకు వరంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ అసరద్ బేగం అన్సారి, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జై వంతరావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇక్బాల్, మాజీ ఎంపీటీసీ రాధాబాయి, డిప్యూటీ తాసిల్దార్ అమృతలాల్, ఎంపీడీవో, లక్కారం మాజీ సర్పంచ్ మరుసుకోల తిరుపతి, గుడ్నూరు మాజీ సహకార చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అచ్చ దేవానంద్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply