Ustaad Bhagat Singh | ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా..

Ustaad Bhagat Singh | ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా..

Ustaad Bhagat Singh, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan) వీరమల్లు, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో వీరమల్లు యావరేజ్ గా నిలిస్తే.. ఓజీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే.. పవన్ ఒప్పుకున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రావాల్సివుంది. ఈ సినిమాని గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీ పై అంచనాలను అమాంతం పెంచేసాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఈ మూవీ నుంచి డిసెంబర్ లో అప్ డేట్ వస్తుందని.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ఇటీవల హరీష్ శంకర్ (Haris shankar) అప్ డేట్ ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ నెల రావడంతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. పవర్ స్టార్ డ్యాన్స్ చేసేందుకు రెడీ అవుతుండడం.. దర్శకుడు హరీష్ శంకర్ తో సరదాగా మాట్లాడుతుండడం.. కనిపించింది. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అని ఈ వీడియో ద్వారా తెలియచేశారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ఎప్పుడు విడుదల చేయనున్నారు అనేది అనౌన్స్ చేయలేదు. హరీష్‌ శంకర్.. ఈ సినిమా కోసం చాన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మరి.. ఈ క్రేజీ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే.. సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి.. గబ్బర్ సింగ్ కాంబోలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Leave a Reply