Urea booking app | రైతులు అవగాహన కలిగి ఉండాలి

Urea booking app | రైతులు అవగాహన కలిగి ఉండాలి
Urea booking app | మునుగోడు, ఆంధ్రప్రభ : యూరియా బుకింగ్ యాప్ పై రైతులు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ విస్తరణ అధికారి యాదగిరి గౌడ్ అన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని శ్రీనివాస ట్రేడర్స్ నందు యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ… రైతులు ప్రతి ఒక్కరూ యాప్ ద్వారా మాత్రమే స్లాట్ బుక్ చేసుకొని యూరియాను కొనుగోలు చేసుకోవాలని లేనియెడల యూరియా అమ్మబడదని తెలిపారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోపు యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతులు తమకి ఉన్న భూమి ప్రకారం వేసిన పంటకు అనుగుణంగా యూరియాను కేటాయించడం జరుగుతుందని కావున రైతులు తమ పంటల వివరాలను ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. కావలసినంత యూరియా అందుబాటులో ఉందని అవసరం మేరకు మాత్రమే యూరియాను బుక్ చేసుకుని తీసుకెళ్లాలని రైతులని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస ట్రేడర్స్ యజమాని వడ్డెంపూడి శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
