Uppal Stadium | నేడు లఖ్‌నవూ, హైదరాబాద్ ఢీ

Uppal Stadium | నేడు లఖ్‌నవూ, హైదరాబాద్ ఢీ

Uppal Stadium | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో ​లో భాగంగా ఇవాళ బిగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ల‌ఖ్‌నవూతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఢీకొన‌నుంది. హైద‌రాబాద్ బ్యాట‌ర్లు విధ్వంసాన్ని సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

హైదరాబాద్‌పై లక్నోదే పై చేయిగా ఉంది. మొత్తం ఆరు మ్యాచ్‌లు జరిగితే లక్నో నాలుగు గెలవగా, హైదరాబాద్ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. గతేడాది హైదరాబాద్ వేదికగా జరిగిన బిగ్ ఫైట్‌లో లక్నో 190 పరుగుల టార్గెట్‌ను హైద‌రాబాద్ జ‌ట్టు కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇలాంటి ఫ‌లితాన్ని పున‌రావృతం చేయ‌డానికి స‌న్‌రైజ‌ర్స్ రెడీ అయ్యింది. ప‌రుగుల వ‌ర్షం కురిపించ‌డానికి ఆట‌గాళ్లు సిద్ధంగా ఉన్నారు. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ కూడా ఆడే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి.

ఉప్ప‌ల్ స్టేడియం వ‌ద్ద భారీ బందోబ‌స్తు..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్​ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులు భ‌ద్రతా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు. ఉప్పల్‌ స్టేడియం వద్ద 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారుల కోసం అందుబాటులో 11 పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను తీసుకురావొద్ద‌ని పోలీసులు సూచించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా..

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ / హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ / డేవిడ్ పైన్, ఈషాన్ మలింగ.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అంచనా..

మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, దిగ్వేష్ రాఠీ, మొహమ్మద్ షమీ, నోకియా, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.

Uppal Stadium

Leave a Reply