Unit-I | రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి..

Unit-I | రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి..

Unit-I | రాప్తాడు, ఆంధ్రప్రభ : రక్తదానం చేయడం వలన ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని ఎస్ వి ఐ టి యాజమాన్యం తెలియజేసింది.గురువారం రాప్తాడు మండల పరిధిలోని హాంపాపురం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ యూనిట్-I ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎన్ఎస్ఎస్ యూనిట్-I వాలంటీర్లు క్రమశిక్షణతో రక్తదాతలకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు.

ఈ సంధర్భంగా ఎస్వీఐటి కళాశాల యాజమాన్యం రక్తదానం చేసిన ఉపాధ్యాయులను విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఒకరు ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని కాపాడుతుంది అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. రక్తదానం చేసిన వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఐటి కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply