ప‌దార్థాల‌ను ప‌రిశీలించిన మున్సిపల్ కమిషనర్

ప‌దార్థాల‌ను ప‌రిశీలించిన మున్సిపల్ కమిషనర్

  • నిల్వ ఉంచిన ప‌దార్థాల షాంపిల్స్ సేక‌ర‌ణ‌
  • ల్యాబ్‌కు త‌ర‌లింపు

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని జిషాన్, హిమాలయ రెస్టారెంట్లలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ న‌ర్స‌య్య‌ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో చేపల మాంసాన్ని పరిమితులు పాటించకుండానే ఫ్రిజ్‌లో నిల్వ చేసి, ఉడకబెట్టి, కాల్చిన చికెన్, మటన్ మాంసాన్ని ప్రజలకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడయ్యింది. ఇలా నిల్వ ఉంచిన మాంసాన్ని తినడం ఆరోగ్యానికి హానికరమని అధికారులు హెచ్చరించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కూడా కచ్చితమైన తనిఖీలు అవసరమని, ప్ర‌తీ వారం తనిఖీలు జరిగితే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించవచ్చని స్థానికులు కోరుతున్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సీజ్ చేసి, హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, కమిషనర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply