విద్యానిలయంలో.. ఉగాది వేడుకలు..

విద్యానిలయంలో.. ఉగాది వేడుకలు..
కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల శాంతి నికేతన్ విద్యానిలయంలో విద్యార్థిని, విద్యార్థులు ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంప్రదాయ వాతావరణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది ప్రాముఖ్యతను తెలియజేసే పాటలు పాడారు.. నృత్యాలు చేశారు. అలాగే ఉగాది పచ్చడి ప్రత్యేకతను గురువులు విద్యార్థులకు వివరించారు. కొత్త సంవత్సరాన్ని సంతోషంగా, ప్రారంభించాలనే సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ డైరెక్టర్ భోగా ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ.. ఉగాది తెలుగు ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు మన సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేసే మంచి అవకాశమని తెలిపారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులు భారతీయ సంప్రదాయాలు, పండుగల విలువలను తెలుసుకోవాలి అన్నారు. ఉగాది కొత్త ఆశలు, కొత్త ఆరంభాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
