ఇద్ద‌రు ఉగ్ర‌వాద‌ సానుభూతిపరుల అరెస్టు

నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసుల దూకుడు
మహారాష్ట్రకు చెందిన ఇద్ద‌రిని ధర్మవరానికి తరలించి విచారిస్తున్న డీఎస్పీ హేమంత్ కుమార్

శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 17 (ఆంధ్రప్రభ):శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో మ‌ళ్లీ ఉగ్ర‌జాడ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ధర్మవరంలో ఒక బిర్యాని సెంటర్లో మాస్టర్ గా పనిచేస్తున్న నూరు మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండి, ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎన్ ఐ ఏ పోలీసులు ధర్మవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ నేపథ్యంలో నూరు మహమ్మద్ ధర్మవరం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

అనంతరం పోలీసుల విచారణలో నూరు మహమ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ విషయాలు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన మరో ఇరువురు ఉగ్రవాద సానుభూతిపరులు ఇదేవిధంగా చాటింగ్ చేస్తున్నట్టు ధర్మవరం కు చెందిన నూరు మహమ్మద్ చెప్పడంతో ధర్మవరం పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఇరువురు ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అరెస్టు చేశారు. వారిని ధర్మవరానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Leave a Reply