వరంగల్‌లో ఇద్దరు చిన్నారులు మిస్సింగ్..

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో గత మూడు రోజుల క్రితం 12 సంవత్సరాల మణికంఠ అనే బాలుడు, సుమారు 11 సంవత్సరాల యజ్ఞశ్రీ అనే బాలిక ఇద్దరు మిస్సింగ్ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా.. మిస్సింగ్ అనుకున్న ఇద్దరు కలిసే వెళ్లినట్టు సీసీ ఫుటేజ్ లో చూసిన బాలిక కుటుంబ సభ్యులు కాలనీవాసులు సోమవారం బాలుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు.

ఇందులో అసలు విషయం ఏంటంటే.. బాలుడిని రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుండగా తీసుకువచ్చి సాదుకుంటున్న లలిత అనే మహిళ ఇంటి ముందు కాలనీవాసులు ధర్నాకు దిగి పోలీసులకు అప్పజెప్పారు. బాలిక ఆచూకీ త్వరగా కనుక్కొని తమకు న్యాయం చేయాలని బాలిక కుటుంబ సభ్యులు కాలనీవాసులు వేడుకున్నారు. బాలుడిని సాదుకుంటున్న మహిళకు అంతా విషయం తెలిసే ఆ బాలుడితో బాలికను పంపించిందని కాలనీవాసులు ఆరోపించారు.

ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న మహిళ పొంతన లేని సమాధానాలు చెపుతుండటం,ఆ అబ్బాయి తో సీసీ ఫుటేజ్ లో కనిపించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ కేసులో మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్, పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply