Trivikram | వెంకీ కోసం మూడు టైటిల్స్…?
Trivikram , ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రీజనల్ సినిమాల్లో హయ్యస్ట్ కలెక్షన్ వసూలే చేసిన సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. దీంతో వెంకీ నెక్ట్స్ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆమధ్య ఈ సినిమాని గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే.. వెంకీ.. మెగాస్టార్ మూవీలో కీలక పాత్ర పోషిస్తుండడంతో త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.
ఈ క్రేజీ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. అయితే.. ఈ సినిమాకి వెంకటరమణ కేరాఫ్ ఆనంద్ నిలయం అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆతర్వాత అబ్బాయి గారు 60 ప్లస్ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారనే మరో వార్త లీకైంది. అబ్బాయి గారు సినిమా వెంకీ (Venky) కెరీర్ లో మంచి హిట్ మూవీగా నిలిచింది. అందుచేత ఈ టైటిలే ఫిక్స్ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ముచ్చటగా మూడో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. బంధు మిత్రుల అభినందనలతో.. ఇలా మూడు టైటిల్స్ లో ఏ టైటిల్ ఫిక్స్ చేయాలా అని త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తుంది.
అయితే.. సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) సంగీతం అందిస్తున్నారు. 2026 ద్వితీయార్థంలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి.. వెంకట రమణ కేరాఫ్ ఆనంద్ నిలయం, అబ్బాయి గారు 60 ప్లస్, బంధు మిత్రుల అభినందనలతో.. ఈ మూడు టైటిల్స్ లో ఏ టైటిల్ ఫైనల్ చేస్తారో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

