Tributes | ఆర్థిక సహాయం అందజేత

Tributes | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఉన్న చేనేత కార్మికుడైన పులిపాటి శ్రీరాములు హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని బీజేపీ నాయకులు కాసోజు శంకరాచారి అన్నారు. ఇవాళ శ్రీరాములు నివాసానికి బీజేపీ కార్యకర్తలతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10,000లు అందించారు. శంకరాచారితో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
