ఐఏటీలో మెరిసిన గిరిజన కుసుమం కీర్తి..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయిలో జరిగిన ఐఏటీ ఫలితాల్లో ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని రాథోడ్ కీర్తి 729వ ర్యాంకు సాధించారు. బీఎస్ఎంఎస్ ఐదేళ్ల సంవత్సరాల్లో కోర్సుల్లో ఒడిశా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ఐఐఎస్ఎస్ఈఆర్ బరంపూర్ కళాశాలలో సీటు సంపాదించింది.
ప్రతిభ సాధించిన కీర్తి (keerthi) తల్లిదండ్రులు రాథోడ్ కిషోర్, తల్లి సరోజ. సరోజ పెరికగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. తండ్రి కిషోర్ వ్యవసాయం చేస్తున్నారు. తమ కుమార్తెకు జాతీయస్థాయిలో ర్యాంకు (National ranking) సాధించి ఎంపిక కావడం ఎంతో సంతోషకరంగా ఉందని తల్లిదండ్రులు ఆనంద వ్యక్తం చేశారు.