Tree | మర్రిపై తాటి..!

Tree | మర్రిపై తాటి..!

  • అంకిరెడ్డిపల్లిలో ప్రకృతి అద్భుతం

Tree | రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో ప్రకృతి తన వైచిత్రిని మరోసారి చాటింది. గ్రామ పరిసరాల్లో ఉన్న ఓ భారీ మర్రి చెట్టు మీద తాటి చెట్టు మొలకెత్తి, సంవత్సరాలుగా అదే చెట్టును ఆధారంగా చేసుకుని ఎదుగుతుండటం చూసిన గ్రామస్తులు విస్మయానికి గురవుతున్నారు. సాధారణంగా నేల మీద మాత్రమే పెరగాల్సిన తాటి చెట్టు,మర్రి చెట్టు కొమ్మల మధ్య తాటి గింజ పడటంతో అక్కడే మొలకెత్తిందని స్థానికులు చెబుతున్నారు.

మర్రి చెట్టు శాఖలను ఆధారంగా చేసుకుని తాటి చెట్టు నిలువుగా పెరగడం ప్రకృతి అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అరుదైన దృశ్యం గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వింత చెట్టును తిలకిస్తున్నారు. ప్రకృతి సమతుల్యతను ప్రతిబింబించే ఈ మర్రి–తాటి వింత చెట్టును భవిష్యత్ తరాలకు అందించేలా పరిరక్షించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ ప్రకృతి అద్భుతాన్ని రక్షించాలని వారు కోరుతున్నారు.

Leave a Reply