మస్కాపూర్ బీట్ అటవీలో ట్రైనింగ్‌

మస్కాపూర్ బీట్ అటవీలో ట్రైనింగ్‌

ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకె ఫంక్షన్ హాల్(AMK Function Hall)లో ఫారెస్ట్ అధికారులకు పులుల గణనపై శిక్షణ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీ అధికారులను ఖానాపూర్ రేంజ్(Khanapur Range)లోని మస్కాపూర్ బీట్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. పులుల గణనను ఎలా చేయాలో వారికి వ‌వ‌రించారు.

ఈ గణన కార్య‌క్ర‌మాన్ని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని, గతంలో 2022లో నిర్వహించామని తెలిపారు. ప్రస్తుత పులుల గణన జనవరి 2026 లో ప్రారంభమై మే 2026 వరకు కొనసాగుతుందని డీఎఫ్ఓ నాగిని భాను పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎఫ్‌డీఏ శివకుమార్(FDA Shivakumar), ఖానాపూర్ ఎఫ్ఆర్ఓ కిరణ్ కుమార్, పెంబి ఎఫ్ ఆర్ ఓ రమేష్ రావు, కడెం ఎఫ్ ఆర్ ఓ గీతా రాణి, ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత, దిమ్మదుర్తి ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, మామడ ఎఫ్ఆర్ అవినాష్ రాథోడ్(Mamada FR Avinash Rathod), బైంసా ఎఫ్ఆర్ఓ రాథోర్ రమేష్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లతోపాటు, ఖానాపూర్ సెక్షన్ ఆఫీసర్ ఏ రవీందర్, ఆయా మండలాల సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు సుమారు 160 మంది ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply