Train | పెను ప్రమాదం తప్పింది

Train | పెను ప్రమాదం తప్పింది

Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలులో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు సిటీ సమీపంలో బోగీ కింద నుంచి దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుకోని ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు సిటీకి చేరుకుంటున్న సమయంలో ఒక బోగీ కింద నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

పరిశీలనలో బ్రేక్ షూలు జామ్ కావడంతో రాపిడి ఏర్పడి పొగలు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు. తరువాత రైలును యథావిధిగా తిరిగి ప్రయాణం ప్రారంభించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Reply