TRAIN | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

TRAIN | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
TRAIN | నెల్లూరు, ఆంధ్రప్రభ : నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న గూడ్స్ రైలుకు ప్రమాదం జరిగింది. దీంతో రెండు బోగీలు పట్టాల నుంచి పక్కకు పడిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకన్న సిబ్బంది. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. లోకో పైలట్ కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు సమాచారం. వెంటనే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. దీంతో, ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
