ట్రాక్టర్ బోల్తా..

నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 12, ఆంధ్రప్రభ : నంద్యాల (Nandyal) జిల్లా వెలుగోడు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పనుల కోసం వెళ్లిన ట్రాక్టర్ (tractor) గాలేరు గంగమ్మ టర్నింగ్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాదే గురు లక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ ఫై జూన్ తీవ్రంగా గాయపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెలుగోడు (Velugodu) గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న గాదే రామాంజనేయులు (Ramanjaneyulu) కుటుంబ సభ్యులు, కూలీలతో కలిసి ఎరువులు వేయడానికి తమ ట్రాక్టర్‌లో బయలుదేరారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో ఆంజనేయుల భార్య గురు లక్ష్మి దుర్మరణం పాలయ్యారు. గాయపడిన ఫై జూన్‌ను వెలుగోడులో ప్రధమ చికిత్స అనంతరం నంద్యాల పట్టణానికి తరలించారు.
