Trade License | దళారుల చేతిలో దగా పడుతున్న రైతన్న
Trade License | రైతులను మోసం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు
–తహసీల్దార్ శ్రీనివాస్

Trade License | తిర్యాణి, ఆంధ్రప్రభ : మారుమూల గిరిజన ప్రాంతమైన మండలంలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేస్తూ దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా ఆన్లైన్లో తమ పత్తి పంటను నమోదు చేసుకొని నేరుగా సీసీఐ లోనే అమ్మాలని కోరారు. మధ్యలో ఉండే దళారుల చేతిలో పత్తి పంటను పెట్టి మోసపోవద్దని సూచించారు. మండలంలో ఎక్కడైనా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మధ్య వ్యక్తులు పత్తి రైతుల వద్ద నుంచి కొంటున్నారని తమ సమాచారం వస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నేరుగా సిసిఐ లోనే అమ్మకాలు జరపాలని కోరారు. మండలంలో ఎక్కడైనా మధ్య వ్యక్తులు పత్తి కొనుగోలు చేస్తున్నారని తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా కోరారు.
Trade License |వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు వేరే

వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు వేరేగా ఉందని మండలానికి చెందిన కొంతమంది రైతులు మండిపడుతున్నారు. పత్తి అమ్మకాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల కోసం కార్యాలయానికి వెళ్తే రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు రైతులు (Farmers) ఆరోపిస్తున్నారు. 10 క్వింటాళ్ళ పత్తి అమ్మడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అదే దళారులు సులభంగా అమ్ముతున్నారని ఇదే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చే మధ్య వ్యక్తులకు కుర్చీలేసి కూర్చుండబెట్టి మరీ పనిచేస్తున్నారని, రైతులను నిలబెట్టి అవమానిస్తున్నారని మండల రైతుల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను, కౌలు రైతులను గౌరవించాలని మండల రైతుల కోరుతున్నారు.
Click Here To Read అడవుల్లో పెద్దపులి ఉంది.. అప్రమత్తంగా ఉండండి..

