ట్రాక్టర్ పరుగే పరుగు..

  • జీఎస్టీ ప్రయోజనాలపై
  • భీమవరంలో ట్రాక్టర్ల ర్యాలీ లో కలెక్టర్ హల్ చల్

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: కలెక్టర్ మేడం ఏంటి.. ట్రాక్టర్ నడపడం ఏమిటి అనుకుంటున్నారా.. విషయం తెలుసుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమం గురించి తెలియాలి. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, యంత్రాలపై జీఎస్టీ తగ్గించడంతో చేకూరిన ప్రయోజనంపై అవగాహన కల్పిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తగ్గిన జీఎస్టీ తో చేకూరిన ప్రయోజనాలపై ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ట్రాక్టర్ నడపండం చూసి అక్కడి ఆశ్చర్యానికి లోనయ్యారు. కలెక్టర్ ట్రాక్టర్ ఉన్న సమయంలో ఒక వైపు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మరో వైపు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ను ట్రాక్టర్ పై ఎక్కించుకుని డ్రైవ్ చేసారు.

ఈ కార్యక్రమంలోనే ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘు రామకృష్ణం రాజు, కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మలు కూడా ట్రాక్టర్లను నడిపి రైతులకు చేకూరిన ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాకా సత్యనారాయణ, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, వ్యవసాయ శాఖ జెడి జెడ్ వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply