TPCC | కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై హర్షం

TPCC | కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై హర్షం

TPCC | వైరా, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంపై టీపీసీసీ (TPCC) ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించార‌ని, ఈ విజ‌యం పార్టీపై ప్రజలకున్న విశ్వాసానికి తార్కానంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్ర‌జ‌ల జీవన స్థాయి పెంచడంలో ముందున్నార‌న్నారు. దీనివల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచార‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలిచిన సర్పంచులకు, వార్డ్ మెంబర్లకు అయన అభినందనలు తెలియజేశారు.

Leave a Reply