వెలగపూడి – ప్రధాని మోదీ ఎపి పర్యటన ఖరారైంది.. ఆయన మే రెండో తేదిన అమరావతికి రానున్నారు.. ఈ సందర్బంగా అమరావతి పునర్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు.. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం నేడు విడుదల చేసింది. కాగా అమరావతిలో 41 వేల కోట్ల రూపాయిలతో చేపట్టనున్న నిర్మాణ పనులను ఆయన లాంచనంగా ఆరంభించనున్నారు.. ఇప్పటికే ఈ నిర్మాణ పనులకు టెండర్లను కూడా ఎపి ప్రభుత్వ ఖరారు చేసింది. అలాగే ఈ పునర్ నిర్మాణ పనులకు కేంద్రం 15 వేల కోట్ల రూపాయిలు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా మరో 3వ వేల కోట్ల రూపాయిలను రిలీజ్ కూడా చేసింది. దీంతో దశలో వారీగా నిర్మాణాలను చేపట్టనుంది ఎపి ప్రభుత్వం..
Tour Schedule | మే 2న అమరావతికి రానున్న ప్రధాని మోదీ
