నేటి రాశిఫలాలు 9.04.25

మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. పనులలో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కర్కాటకం: సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

సింహం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనుల్లో పురోగతి సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనుల్లో విజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

కుంభం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.

మీనం: పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *