ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం..

ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి కె. సురేందర్ మోహన్ (ఐఏఎస్) ను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామ సర్పంచ్ ఎన్నపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసి శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ కు వివరించారు. గ్రామ అభివృద్ధి కోసం, గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సహకారం అందించాలని సర్పంచ్ కోరారు.
