నిధులు పక్కా దారి పట్టకుండా..

నిధులు పక్కా దారి పట్టకుండా..
కుంటాల, ఆంధ్రప్రభ : ప్రగతి పాలన ప్రగతి ప్రణాలిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలిసికట్టుగా అధికారులు పని చేయాలని, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధికి ద్రోహదపడాలని సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు సమీక్ష కృషితో గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలి అన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను పక్కా దారి పట్టకుండా ప్రణాళిక బద్ధంగా నిర్వహించుకోవాలని అన్నారు.
ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. అదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి అధిక సంఖ్యలో జనాన్ని గ్రామసభలో చైతన్యపరచాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీ ఓ ఎంఏ అబ్దుల్ రహీం, మండల విద్యాధికారి ముత్యం వ్యవసాయ అధికారి విక్రమ్, మిషన్ భగీరథ ఏఈ దత్తురం, పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
