తిరుమల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్ నోవా స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి దర్శనార్థం ఈ సాయంత్రం తిరుమలకు చేరుకున్నటు వంటి అన్నా లేజ్ నోవా అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరుమల గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు..

తర్వాత నేరుగా వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకొని వరాహస్వామి వారిని దర్శించుకొని..తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్ట వద్దకు చేరుకుని స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ రాత్రికి తిరుమలలోనే బస్సు చేయనున్నటువంటి అన్నా లేజ్ నోవా రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు
