Tirumala | మొదటి ఘాట్‌రోడ్డులో ఏనుగుల గుంపు హల్‌చల్‌

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డు సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

వేసవి ప్రారంభమైన నేపథ్యంలో నీటికోసం ఏనుగుల గుంపు మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద సంచరించాయి.

ఏనుగుల ఘీంకారాలతో నడకదారిలో తిరుమలకు వస్తున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. మరి కొంతమంది భక్తులు తమ సెల్‌ఫోన్‌లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

ఈ సమాచారం అందుకున్న టిటిడి అటవిశాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శబ్దాలను చేస్తూ ఏనుగుల గుంపును అటవి ప్రాంతంలోకి మళ్ళించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *