ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగింది.
➢ ఏపీపీఎస్సీ ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో) ప్రత్యక్ష నియామకాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీవో)లను సింగిల్ కేడర్‌గా మార్పు చేసింది.
➢ గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
➢ డీపీవోలు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పులపై నిర్ణయం తీసుకుంది. డీడీవో, డీపీవో, డిప్యూటీ సీఈవోలకు సంబంధించి ముూడోవంతు ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయటంతో పాటు మిగిలిన పోస్టులకు పదోన్నతులతో పూరించాలని మార్గదర్శకాలు జారీ.
➢ జెడ్పీ సీఈవోలుగా 50 శాతం ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఐఏఎస్‌లు లేనిచోట పదోన్నతులతో భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.
➢ ఉన్నత విద్యామండలి, ప్రత్యేక కమిటీల సిఫార్సుల మేరకు రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాలను అనుమతిస్తూ రూపుదిద్దుకున్న చట్ట సవరణ బిల్లుపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
➢ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం.
➢ 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ .
➢ విశాఖపట్నం సీతంపేటలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు ఉచితంగా భూమి కేటాయించాలని నిర్ణయం.
➢ రాజమండ్రిలో అగ్రికల్చర్ కాలేజీకి ఉచితంగా భూమి కేటాయించాలనే ప్రతిపాదనలకు ఆమోదం.
➢ పాత రైల్వే హ్యావలాక్ బ్రిడ్జి అభివృద్ధికి 116 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
➢ లిక్కర్ షాపుల్లో సొండి కులాలకు నాలుగు షాపులు కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
➢ టూరిజం పాలసీ 2024-29కు ఆమోదం. పీపీపీ పద్దతిలో పర్యాటక ప్రాజెక్టులు.. ప్రపంచ ప్రమాణాలతో అభివృద్ధి
➢ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వృద్ధి వ్యూహానికి ఊతమిస్తూ సీనియర్, సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్, రీడీమబుల్, టాక్సబుల్ నాన్ కన్వెర్టిబుల్ డిబెంచర్స్ బాండ్లు విడుదల ద్వారా రూ.9000 కోట్లు నిధులు సమీకరణ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.