Tirumala | తిరుమల లడ్డూ వ్యవహారంపై.. ఏకసభ్య కమిషన్

Tirumala | తిరుమల లడ్డూ వ్యవహారంపై.. ఏకసభ్య కమిషన్
- ప్రకటించిన చంద్రబాబు
Tirumala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేవుడితో పెట్టుకుంటే.. నీ ఆటలు సాగవని, దేవుని పవిత్రతను దెబ్బతీయడం మహాపాపమన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. ఇవాళ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ విషయంలో తప్పుచేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన కుండుబద్దలు కొట్టారు. దుర్మార్గాలు చేసి తిరిగి తమపై ఎదురుదాడి చేస్తున్నారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఏపీ సీఎం ఎండగట్టారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తప్పులు చేసి.. తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
