ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి..

ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి..
చేవెళ్ల, నవంబర్ 3(ఆంధ్రప్రభ) : రంగారెడ్డి జిల్లా (Rangareddy district) చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని బసవన్నకట్టకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్ లో చదువుతున్నారు.
వీరు ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరు తాండూరుకు వచ్చారు. ఈరోజు ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ బస్సు ప్రమాదం ఘటనలో ఒకే కుటుంబానికి చెందినపై ముగ్గురు అక్క చెల్లెలు చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
