మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు రోజుల జైలు శిక్ష
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : పెద్దపెల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 25 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులు పట్టుపడ్డారు. గోదావరిఖని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బీ. రాజేశ్వరరావు(B. Rajeswara Rao) నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగినది.
ఈ కేసులో పట్టుబడిన వారిని ఈ రోజు గోదావరిఖని సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ ధ్రువ(Venkatesh Dhruva) ముందు హాజరు పరచగా, వారిలో 24 మంది వ్యక్తులకు మొత్తం రూ. 48000 జరిమానా విధించారు. అంతేకాక మద్యం సేవించి వాహనం నడపడం అనే అపరాధాన్ని రెండవసారి చేసిన ఒక ఆటో డ్రైవర్ కి మూడు రోజుల జైలు శిక్ష విధించి, వెంటనే కరీంనగర్ జిల్లా(Karimnagar District) జైలుకు తరలించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు తనిఖీలలో భాగంగా…” మద్యం సేవించి వాహనం నడపడం కేవలం వ్యక్తిగతంగా కాదు- సమాజం మొత్తానికే ప్రమాదం కలిగే చర్య. ప్రజల భద్రత కోసం ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) లు నిర్వహిస్తున్నాం.
ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘించిన కఠినంగా వ్యవహరించబడుతుంది”. అని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించడం ద్వారా ప్రజల్లో మున్ముందు అవగాహన పెరుగుతుందని ట్రాఫిక్ శాఖ ఆశిస్తోంది. మద్యం సేవించి వాహనం నడుపుతే అది ప్రాణాంతకర ప్రమాదాలకు దారి తీస్తుందని ప్రజలు గమనించాలని అధికారులు కోరుతున్నారు.