Threat | ధర్మవరం కోర్టులో బాంబు కలకలం..

Threat | ధర్మవరం కోర్టులో బాంబు కలకలం..


కోర్టు పరిసర ప్రాంతాలు కట్టుదిట్టం
బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ విసృత తని
ఖీలు

Bomb | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టు కాంప్లెక్స్‌లో ఆర్డీఎక్స్ బాంబు పేలుతుందన్న ఈమెయిల్ సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు పేలుడు సంభవించే అవకాశం ఉందని మెయిల్‌లో పేర్కొనడంతో జ్యుడిషియల్ సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులను వెంటనే బయటకు తరలించారు. దీంతో కొంతసేపు కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని కోర్టు ఆవరణను పూర్తిగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రతి గదిని పరిశీలిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలను కోర్టు పరిసరాలకు అనుమతించకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. అయితే ప్రారంభ పరిశీలనలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ప్రాథమిక సమాచారం. బెదిరింపు మెయిల్ నిజమా, లేక దుష్ప్రచారమా అన్న దానిపై పోలీసులు సైబర్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కోర్టు కార్యకలాపాలు కొంతసేపు నిలిచిపోయి తరువాత సాధారణ స్థితికి వచ్చాయి. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవనున్నాయి.

Leave a Reply