ఆరోగ్య రక్షణకు జంక్ ఫుడ్ వద్దు.. పండ్లు ఎంతో మేలు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; ఆరోగ్య రక్షణకు పండ్లు తినటం ఎంతో మేలు అని తొర్రూరు ప్రథమ పౌరుడు ఇటీవల ఎన్నికైన పురపాలక చైర్మన్ తూనం శ్రవణ్ చెప్పారు. శనివారం రోజున పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో పాఠశాల వారు ఫ్రూట్స్ డే ను నిర్వహించారు. 100 రకాల పండ్ల స్టాలను ప్రారంభించి స్టాళ్లను పరిశీలిస్తూ విద్యార్థులు తెలిపిన పండ్ల వివరాలను పోషక విలువలను ఆరోగ్యానికి మేలు చేసే విషయాలను విద్యార్థులు చెప్తుంటే శ్రద్ధగా విన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ.. పిల్లలు బయట దొరికే జంక్ ఫుడ్స్, చాక్లెట్లు తదితర ఆకర్షణమైన రసాయనిక పదార్థాలు కల్పినవి తినడం వల్ల దంత సమస్యలతో పాటు అనారోగ్యానికి గురవుతారని, ఇప్పటి నుంచే తమ పిల్లలకు కనీసం రోజు ఒక ఆపిల్ లేదా ఏదైనా పండ్లు తినేలా అలవాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏ దేవేందర్ రెడ్డి డైరెక్టర్లు ఎర్ర సంపత్ , ఏ నాగిరెడ్డి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు పాత్రికేయులు దూలం శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు లకావత్ యాదగిరి మెరుగు రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply