ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ ఇదే…

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ ఇదే…

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ దిగువ విధంగా విచార‌ణను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ చేప‌ట్ట‌నున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదు దారుల అడ్వకేట్ల మధ్య వాదనలు జరగనున్నాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు (Lawyers) ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారు.

  • సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచార‌ణ‌
  • అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కాలే యాదయ్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దాఖలు చేసిన పటిషన్ పై విచారణ జరపనున్నారు.
  • అదే రోజు మధ్యాహ్నం 1 గంటలకు గూడెం మహిపాల్ రెడ్డిపై చింతప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఫిటిష‌న్ విచార‌ణ‌
  • మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరపనున్నారు.

ఎమ్మెల్యేలకు ఇప్పటికే సమాచారం
పార్టీ ఫిరాయింపుల పిటిషన్ల విషయంలో స్పీకర్ కు సుప్రీంకోర్టు విధించిన గడువు వచ్చే నెల 30తో ముగియనుంది. ఆలోపే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్పీకర్ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మొత్తం ప‌ది మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు నోటీసులు (Party defection notices) స్పీకర్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి తమ వివరణలను అఫిడవిట్ రూపంలో అందజేశారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా ఎనిమిది మంది తమ వివరణలను స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. విచారణ కోసం న్యాయవాదులను సమకూర్చుకోవాలని ఇరు పక్షాలకు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు లేఖలు పంపించగా తాజాగా విచారణ షెడ్యూల్ ను విడుదల చేశారు.

Leave a Reply