ఓటు మీ వంతు… అభివృద్ధి నా వంతు

జనగామ, ఆంధ్రప్రభ : మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడవ వార్డ్ కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి బూడిద జ్యోతి గోపి దూకుడు పెంచారు. నోట్లో నాలుకల ఉన్న మీ అభివృద్ధి నా ధ్యేయం అంటూ మూడవ వార్డ్ కాంగ్రెస్ సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి బూడిద జ్యోతి గోపి ఆదివారం గడపగడపను తట్టింది.
గత 10 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ పాలనలో ఉండి తట్ట మట్టి కూడా తీయలేకపోయారని విమర్శించారు. కౌన్సిలర్ గా ఎన్నుకుంటే అభివృద్ధి చేసి మీ ముందు ఉంచుతానని అన్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళతనని హామీ ఇచ్చారు. అలాగే జనగామ శివారు కాలనీ ఆయన జిఎంఆర్ కాలనీకి సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు నిర్మాణం చేపట్టేందుకు మా వంతు కృషి చేస్తామని అన్నారు. ఇందుకుగా చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియాలని వేడుకుంది.
ఓటు మీ వంతు.. అభివృద్ధి నా వంతు
నికార సైన నాయకులను ఎన్నుకోవడం మీవంతైతే అభివృద్ధి చేయడం నావంతని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ సిపిఎం పార్టీలు బలపరిచిన మూడవ వార్డు అభ్యర్థి బూడిద జ్యోతి గోపి హామీ ఇచ్చారు. ఎలాంటి పదవులు లేకున్నా గాని ఆపదంటే నేనున్నానంటూ ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జనగామలో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపిస్తే మరింత అభివృద్ధికి బాట వేస్తామని వేడుకున్నారు. గెలిపించిన అనంతరం అభివృద్ధి చేయకుంటే అడిగే హక్కు మీకుంది . మీరు గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపించేందుకే మీ ముందుకు వస్తున్నానని అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు మచ్చ ప్రవీణ్, ప్రవీణ్, సిపిఎo నాయకులు కార్యకర్తలు తోటి మిత్రులు పాల్గొన్నారు.
