Third One Day |భారత్ భారీ స్కోర్… ఇంగ్లండ్ విజయ లక్ష్యం ఎంతంటే
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ ఇండియా నిర్ధారిత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి అలౌటైంది. .. ఇంగ్లండ్ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.. ఇక ఇంటియా బ్యాటింగ్ లో శుభమ్ గిల్ శతకంతో మెరవగా, కోహ్లీ, శ్రేయస్ ల అర్ధశతకాలు చేశారు..
ముందుగా మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది . కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇక రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 6 రన్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత గిల్ కు తోడుగా కోహ్లీ దిగాడు . ఇక కింగ్ కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఈ మ్యాచ్ తో ఫామ్ ను అందుకున్నాడు.. ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్ తో 52 పరుగులు చేసి ఔటయ్యాడు.. 55 బంతులను ఫేస్ చేసిన కింగ్ తన 52 పరుగులను ఒక సిక్స్, ఏడు ఫోర్ల్ తో పూర్తి చేసుకున్నాడు.. కోహ్లీ వికెట్ సైతం అదిల్ కు దక్కింది..ఇక కోహ్లీ, గిల్ లు రెండు వికెట్ కు 116 పరుగులు జోడించారు.. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ ఆది నుంచే ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.. గిల్ ,శ్రేయస్ లు మూడో వికెట్ కు 104 పరుగులు జోడించారు.. ఇక ఓపెనర్ శుభమ్ గిల్ అద్భుత శతకం సాధించాడు.. 102 పరుగులను ఎదుర్కొన్న గిల్ 112 పరుగులు చేసి రషిద్ బౌలింగ్ లో మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.. ఈ శతకంలో మూడు సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి..
గిల్ ఔటైన తర్వాత కెఎల్ రాహుల్, శ్రేయస్ కలసి బ్యాటింగ్ కొనసాగించారు.. శ్రేయస్ 78 పరుగులు చేసి అదిల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.. శ్రేయస్ 78 పరుగులలో రెండు సిక్స్ లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి.. ఇక కెఎల్ రాహుల్ 40, హర్ధిక్ 17, అక్షర పటేల్ 13, వాషింగ్టన్ సుందర్ 14, హర్షిత్ రానా 13, అర్షదీప్ సింగ్ రెండు పరుగులు చేసి ఔటయ్యారు.. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషిద్ కు నాలుగు వికెట్లు లభించగా, వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు..మహమూద్, అట్కిన్ సన్, జోరూట్ లకు తలోవికెట్ దక్కింది.
ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. జేమీ ఒవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ ను తీసుకుంది.