Sanitation| పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు..

Sanitation| పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు..

  • ప్రధాన రహదారిల్లో ఖచ్చితంగా మూడు రంగుల చెత్తబుట్టలు ఉండాలి
  • విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

Sanitation| విజయవాడ (కార్పొరేషన్), ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రధాన రహదారిల్లో ఖచ్చితంగా మూడు రంగుల చెత్తబుట్టలు ఉండాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా సీకే రెడ్డి రోడ్డు, మ్యూజియం రోడ్డు, దేవినగర్ మెయిన్ రోడ్డు, జిఎస్ రాజు రోడ్డు, మధురానగర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రతిరోజు వ్యర్ధాలను ఇంటి వద్దనే విభజించి సేకరించాలని సేకరించిన వ్యర్ధాలను అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్లో వ్యర్ధాల నుండి సంపద సృష్టించాలని, శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.

నగర ప్రధాన రహదారుల్లో ఖచ్చితంగా మూడు రంగుల గల చెత్తబుట్టలు ఉండేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని. మూడు రంగుల చెత్తబుట్టల్లో, ఏ రంగు చెత్తబుట్టలో ఎటువంటి వ్యర్ధాలు వెయ్యాలో వాటిని తెలియపరిచే స్టిక్కర్లు వాటిపై ఉండేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అయోధ్య నగర్ అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహార నాణ్యత లో ఎటువంటి లోపం ఉండరాదని, విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన వసతుల్లో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు తమతమ అన్న క్యాంటీన్లను తప్పకుండా పరిశీలించాలని అన్నారు. ఈ పర్యటనలో పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) ఏ. శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply