ఢిల్లీ, ఆంధ్రప్రభ : గిరిజన విద్యార్థి సంఘం, బంజారా జన సంఘం, లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. లంబాడీలు, ఆదివాసుల మధ్య తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చిచ్చు పెడుతున్నారని నిరసనకు దిగారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, మాజీ ఎంపీ సోయం బాబూరావులను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుట్ర వెనక ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కల పై చర్యలు తీసుకోవాలని కోరారు.


