రూ.15వేలు అపహరణ..
వెల్గటూర్, అక్టోబర్ 7:(ఆంధ్ర ప్రభ) : మండల కేంద్రంలోని రేణికుంట ప్రసాద్ (Renikunta Prasad) కు సంబంధించిన బాలాజీ కిరాణా షాపులో చోరీ జరిగింది. షాపులో ఉన్న రూ.15వేలను గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో రేణికుంట ప్రసాద్ కు కిరాణ షాపు ఉంది.
రోజు లాగే కిరణం షాపు రాత్రి 8 గంటలకు మూసివేసాడు. సోమవారం రోజు రాత్రి 1:48 నిమిషాల ప్రాంతంలో గుర్తుతెలియని దొంగలు (Thieves) కిరాణ షాపులోకి దూరి షాపులో ఉన్న రూ.15వేలు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరా (CCTV footage) లో రికార్డు అయ్యి ఉంది. మంగళవారం ప్రసాద్ ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ వివరించారు.