వార్డులో నీటి సమస్యను పరిష్కరిస్తా…

వార్డులో నీటి సమస్యను పరిష్కరిస్తా…

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తానని ఆ వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్ తెలిపారు. వార్డులోని గడి పక్కన ప్రజలు నీళ్లకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి తన సొంత ఖర్చులతో మంగళవారం బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

వార్డులో అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు సురేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఉప్పల్ రెడ్డి, రాంరెడ్డి,మోహన్ రెడ్డి, నర్సింగోజు భగవంతయ్య, గూడ శ్రీనివాస్, నర్సింగోజు నరసింహాచారి, ఆకారపు సురేష్, నర్సింగోజు విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply