ఏర్పేడును చుట్టేసిన స్వ‌ర్ణ‌ముఖి

ఏర్పేడు, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ ) : ఏర్పేడు మండలం (Erapedu Mandal) మోదుగులపాలెం వద్ద సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో న‌దికి అటువైపు గ్రామాలైన మోదుగులపాలెం ,కుక్కల వారి కండ్రిగ ,కుమ్మరమిట్ట, మోదుగులపాలెం గిరిజన కాలనీ తదితర గ్రామాలతో పాటు పాపానాయుడుపేట వైపు వెళ్లే గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏర్పేడు మండలం మోదుగులపాలెం రావాలంటే శ్రీకాళహస్తి వైపు వెళ్లి బండారుపల్లి మీదుగా రావాల్సిందే.

మోదుగులపాలెం (Modugulapalem) సమీపంలో కుమ్మర మిట్ట వద్ద కోనకాలువ‌ పెరిగిందంటే మోదుగులపాలెం గ్రామం దిగ్బంధంలో ఉండాల్సిందే. మోదుగులపాలెం ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు స్వగ్రామం. ఈ గ్రామానికి ఏర్పేడు నుంచి వెళ్లాలంటే కొత్త వీరాపురం- మోదిగులపాలెం గ్రామాల వద్ద సువర్ణ ముఖి నదిపై లోలెవల్ కాజ్ వే ఉంది. ప్రస్తుతం నీటి ప్రవాహం లోలెవెల్ కాజీపేట అధికంగా ఉండడంతో అధికారులు రాకపోకలు స్తంభింప చేశారు.


సువర్ణముఖి నది (Suvarnamukhi River) ఉధృతికి ఇసుక తాగేలి గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. దీంతో నీరు వెలుపలకు వెళ్లే మార్గం లేక ప్రాథమిక పాఠశాల ప్రాంగణం, గ్రామపంచాయతీ కార్యాలయం వర్షపునీరుతో నిండిపోయింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న బ్లీచింగ్ పౌడర్, సున్నం బస్తాలు నీటిలో తడిసాయి. పలు కాలనీలు జలమయం అవుతున్నాయి. బండారుపల్లిలో మిల్లు వీధి పూర్తిగా నీటితో నిండిపోయింది.

Leave a Reply